
సంకల్పం ఉంటే వయసుతో పనిలేదు అనడానికి ఈ బామ్మే నిదర్శనం. ఊరికి సేవ చేయాలనే తన చిన్ననాటి డ్రీమ్ ని 97 ఏళ్ల వయసుకి నెరవేర్చుకుంది. అవును.. 97 ఏళ్ల ఈ బామ్మ సర్పంచ్ గా పోటీ చేసి.. బంపర్ మెజారిటీతో గెలిచింది. అద్భుతమైన రికార్డ్ సృష్టించిన ఈ అరుదైన సంఘటన రాజస్థాన్ లో జరిగింది.
రాజస్థాన్ లోని నీమ్ కా థానా సబ్ డివిజన్, పురానాబాస్ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విద్యాదేవీ అనే 97 ఏళ్ల వృద్ధ మహిళ సర్పంచ్ గా పోటీ చేసింది. నామినేషన్ వేసినప్పట్నుంచే ఈవిడేం గెలుస్తుందిలే అనుకుని ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు. కానీ.. ప్రజలు ఆమెకు పట్టాభిషేకం కట్టారు. ఒకిరికి తెలియకుండా ఒకరు విద్యాదేవీకి ఓట్లు వేశారు. విచిత్రం ఏమిటంటే.. డబ్బులు వేరే పార్టీల దగ్గర తీసుకున్నవాళ్లు కూడా ..ఓటు మాత్రం బామ్మకే వేశారు.
శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో విద్యాదేవి సర్పంచ్ గా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 207 ఓట్ల మెజారిటీతో గెలిచిన బామ్మకు.. గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వయస్సులో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన బామ్మకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సర్పంచ్ గా గెలిచిన బామ్మ.. గ్రామానికి సేవ చేయాలనే ఎన్నికల బరిలో నిలిచాననీ.. నన్ను గెలిపించినందుకు, తనకు మద్దతుగా నిలిచినందుకు ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
See Also: కేసీఆర్ తో కొట్లాడైనా నిధులు తెస్తా
Sikar: 97 year old Vidya Devi won panchayat polls, elected Sarpanch of Puranabas village in Neem Ka Thana sub division, yesterday #Rajasthan pic.twitter.com/C6iEGY27yB
— ANI (@ANI) January 18, 2020