నిజామాబాద్ లో 9వ తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి చెందాడు. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో శివ జస్విత్ రెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. శివ జస్విత్ నవంబర్ 29 (శుక్రవారం) స్కూల్లో ఉండగానే నోట్లో నుంచి రక్తం కక్కుకొని చనిపోయాడు. అనుమానాస్పద స్థితిలో తమ కుమారుడు మృతి చెందాడని జస్విత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తమ కొడుకు మృతిపైన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్ట్ అనంతరం బాధ్యుల పై చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. విద్యార్థి మిస్టరీ మృతి కాకతీయ విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలు ఆంధోళనకు పిలుపునిచ్చారు. కాకతీయ విద్యా సంస్థలు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. అనారోగ్యం, ఆకస్మిక గుండెపోటుతో విద్యార్థి చనిపోయాడని స్కూల్ యాజమాన్యం చెప్తోంది.