
ఆన్ లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్ కి బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కి బానిసలుగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, జగిత్యాల జిల్లాలో ఓ కుర్రోడు ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని అన్నందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ( సెప్టెంబర్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల పట్టణంలోని లింగమేపేటలో చోటు చేసుకుంది ఈ ఘటన.
లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు పడి తరచూ మొబైల్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని వారించింది తల్లి. దీంతో తల్లికి ఎదురుతిరిగిన విద్యార్ధి ఆమెపై దాడికి దిగాడు. అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్షవర్ధన్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆన్లైన్ గేమ్స్ కి పిల్లలు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. పిల్లలు మొబైల్ కి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల, స్కూల్లో టీచర్లదే అని అంటున్నారు పోలీసులు.