మెడికవర్​లో 16 నెలల చిన్నారికి సర్జరీ సక్సెస్

మెడికవర్​లో 16 నెలల చిన్నారికి సర్జరీ సక్సెస్

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​ మెడికవర్ పీడియాట్రిక్ ​డాక్టర్లు 16 నెలల చిన్నారికి విజయవంతంగా సర్జరీ చేశారు. మంగళవారం సర్జరీకి సంబంధించిన వివరాలను విమెన్ ​అండ్ చైల్డ్​పీడియాట్రిక్​ సర్జరీ హెడ్​ డా.మధు మోహన్​రెడ్డి వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన 16 నెలల పాపను తల్లిదండ్రులు ఇటీవల మాదాపూర్ ​మెడికవర్​కు తీసుకొచ్చారు. పుట్టుకతోనే పాప చాతి కుహరం వెలుపల కొట్టుకోవడం, పలుచటి చర్మంతో కప్పబడి ఉండటం, పేగులు, ఇతర అవయవాలు బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి. 

సమస్యను గుర్తించిన డాక్టర్లు పాప పెంటాలజీ ఆఫ్​కాంట్రెస్​తో బాధపడుతున్నట్లు తెలిపారు. వెంటనే సర్జరీకి రెడీ చేశారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు, సీవీటీ సర్జన్లు,  పీడియాట్రిక్​సర్జన్లు, ప్లాస్టిక్​సర్జన్లు, అనస్థటిస్టులు, నర్సింగ్ సిబ్బంది 14 గంటల పాటు శ్రమించి ఆపరేషన్​ను సక్సెస్​చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 55 లక్షల మందిలో ఒక్కరే ఇలా పుడతారని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలా 90 మంది మాత్రమే పుట్టారని, ఇది చాలా రేర్ కేస్​అన్నారు. సర్జరీలో డాక్టర్లు ఆశిష్​సప్రే, శ్రీనివాస్​కిని, ఇతరులు పాల్గొన్నారు.