IPL 2026: రాయల్స్ జట్టుకు లంక దిగ్గజం డ్యూయల్ రోల్.. హెడ్ కోచ్‌తో పాటు డైరెక్టర్‌గా బాధ్యతలు

IPL 2026: రాయల్స్ జట్టుకు లంక దిగ్గజం డ్యూయల్ రోల్.. హెడ్ కోచ్‌తో పాటు డైరెక్టర్‌గా బాధ్యతలు

ఐపీఎల్ 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు. సంగక్కరకు హెడ్ కోచ్ పాటు క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు కూడా రాజస్థాన్ ఫ్రాంచైజీ అప్పగించింది. దీంతో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ జట్టుకు ఈ లంక దిగ్గజం ద్విపాత్రాభినయం  చేయనున్నాడు. గత సీజన్‌లో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోర్ కు అసిస్టెంట్ కోచ్‌గా ప్రమోషన్ లభించింది. 2025లో రాజస్థాన్ జట్టు నుంచి విడిపోయిన ద్రవిడ్ స్థానంలో సంగక్కర ఈ బాధ్యతలను స్వీకరిస్తాడు.  ద్రవిడ్ కూడా గత సీజన్ లో రెండు హెడ్ కోచ్ తో పాటు క్రికెట్ డైరెక్టర్‌ గా పని చేశాడు. 

"కుమార్ ప్రధాన కోచ్‌గా తిరిగి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. జట్టుకు ఏమి అవసరమో మేము పరిశీలించినప్పుడు, సంగక్కరతో పరిచయం.. అతని నాయకత్వం.. రాయల్స్ జట్టుపై అతనికి ఉన్న అతని లోతైన అవగాహన జట్టుకు సమతుల్యతను తీసుకొస్తుందని భావించాము. ఒక నాయకుడిగా కుమార్ పై ఎప్పటికీ మాకు పూర్తి నమ్మకం ఉంటుంది. అతని క్లారిటీ, ప్రశాంతత, క్రికెట్ తెలివితేటలు జట్టును ముందుకు నడిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి". అని రాజస్థాన్ ఫ్రాంచైజ్ ప్రధాన యజమాని మనోజ్ బదాలే సోమవారం (నవంబర్ 16) అన్నారు. 

సంగక్కర గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కలిసి పని చేశాడు. 2021 నుండి 2024 వరకు జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. సంగక్కర జట్టుతో ఉన్నప్పుడు రాజస్థాన్ వన్ ఆఫ్ ది టాప్ జట్టుగా దూసుకెళ్లింది. 2022 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2024 లో ప్లే ఆప్స్ కు అర్హత సాధించింది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ కు ఇచ్చేసింది. శాంసన్ స్థానంలో రాయల్స్ జట్టులో జడేజా, సామ్ కరణ్ చేరారు. రాథోర్ అసిస్టెంట్ కోచ్ తో పాటు, షేన్ బాండ్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతారని ఫ్రాంచైజీ ప్రకటించింది. ట్రెవర్ పెన్నీ, సిడ్ లాహిరి వరుసగా అసిస్టెంట్ కోచ్, పెర్ఫార్మెన్స్ కోచ్‌గా కొనసాగుతారని చెప్పుకొచ్చింది. 

రాజస్థాన్ రాయల్స్ (RR):

రిటైన్: 

యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, వైభవ్ సూర్యవంశీ, లుహాన్ డ్రే ప్రిటోరియస్, శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా (DC నుండి), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా (CSK నుండి), సామ్ కుర్రాన్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, టుడ్రే దేర్పాన్, సందీప్ దేర్పాన్ శర్మ, మఫాకా, యుధ్వీర్ సింగ్

రిలీజ్:
 
కునాల్ రాథోడ్, నితీష్ రాణా (డీసీకి), సంజు శాంసన్ (CSKకి), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూఖీ, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్