డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సత్తుపల్లి జేవిఆర్ ఓపెన్ కాస్ట్ ను సందర్శించి..HMS సింగరేణి యూనియన్ నాయకుల మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. రెండేళ్లుగా మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతున్నామని చెప్పారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిదన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తామన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నామన్నారు కవిత.
సింగరేణి గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ కట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. మీ కోసం పోరాటం చేసే తమకు అండగా ఉండాలన్నారు. కొత్త బొగ్గు బ్లాక్ లు సింగరేణికి అందించాలని కోరుతున్నాం. కేంద్రం బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేయడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం సింగరేణికి 40 వేల కోట్లు అప్పు ఉందన్నారు కవిత. సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయాలని కోరారు. ఆసుపత్రి నిర్మాణం చేసే లోపు కార్పోరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ అయ్యే ప్రయత్నం చేస్తామన్నారు. బొగ్గు బావిలోకి దిగే ముందు మైసమ్మకు మొక్కుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు.
