Manchu Lakshmi : పెళ్లి తర్వాత రకుల్ మారిపోయింది.. ఇలా కొంతకాలమే చూస్తా.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Manchu Lakshmi : పెళ్లి తర్వాత రకుల్ మారిపోయింది.. ఇలా కొంతకాలమే చూస్తా.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నటీముణులుగా వెలుగొందుతున్న మంచులక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య బలమైన స్నేహబంధం ఉంది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వీరు ఒకరికొకరు తోడుగా నిలుస్తుంటారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న తర్వాత వీరి స్నేహంలో చిన్నపాటి మార్పు వచ్చిందని లక్ష్మీ మంచు ఇటీవల వెల్లడించారు. ఈ మార్పు సహజమే అయినప్పటికీ, పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మారుతున్న జీవితాలు..

లేటెస్ట్ గా మంచు లక్ష్మీ ఓ ఇంటర్యూలో  తన స్నేహితురాలు రకుల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నా పుట్టినరోజున, రకుల్, జాకీ ఇద్దరూ నన్ను పక్కకు పిలిచి, 'లకూ, నువ్వు చాలా మారిపోయావ్' అన్నారు.  ఆ మాటలకు నేను కొంత కన్ఫ్యూజ్ అయ్యానంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.  నిజానికి, ఆ మార్పు మా ఇద్దరి జీవితాల్లోనూ వచ్చింది. నేను ముంబైకి మకాం మార్చాను. రకుల్ ఇప్పుడే పెళ్లి చేసుకుంది. మా జీవితాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మార్పు సహజం అని ఆమె వివరించారు.

ఏం అడిగినా 'జాకీ-జాకీ'..

 ఈ మధ్య రకుల్ తన ప్రతి చిన్న ప్లాన్‌ను కూడా ఇప్పుడు జాకీతో చర్చించిన తర్వాతే ఖరారు చేస్తుందని  మంచు లక్ష్మీ చమత్కరించారు. ఏం అడిగినా, 'నేను జాకీని అడగాలి', లేదంటే జాకీ రేపు పనిలో ఉన్నాడు అంటుంది. ఎప్పుడూ 'జాకీ-జాకీ' అని పదేపదే చెబుతోంది అని చెప్పారు. అయితే ఇది కొత్తగా పెళ్లయిన వారిలో కనిపించే విషయం కాబట్టి, మరో ఏడాది పాటు తాను ఓపిక చూస్తా.. ఆ తర్వాత ఖచ్చితంగా గట్టిగాదండిస్తా అంటూ సరదాగా హెచ్చరించారు. ఒకవేళ జాకీ రాలేకపోతే, నువ్వు మాత్రం రావచ్చు అని తాను రకుల్‌కు చెబుతా చెప్పింది...

స్నేహితుల గ్రూప్ రూల్స్

మా స్నేహితుల బృందంలో జాకీ భగ్నానీ కొత్త వ్యక్తి , తన భర్త బిజీగా ఉన్నా రకుల్ తమ గ్రూప్ అవుటింగ్‌లకు రావడం మానకూడదని లక్ష్మీ అన్నారు. జాకీ మా గ్రూప్‌కు బయటి వ్యక్తి. అతను రాలేకపోతే, ఆమె ఖచ్చితంగా మాతో చేరాలి అని తెలిపింది. గతంలో మంచు లక్ష్మీ ముంబైకి వచ్చినప్పుడల్లా రకుల్ ఇంట్లోనే ఉండేదని,.. హైదరాబాద్‌లో అయితే వీరి ఇళ్లు కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఉండేవని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ప్లానింగ్‌లు లేకుండానే తరచూ కలుసుకునేవాళ్లమని చెప్పారు. ఆ రోజులు చాలా సరదాగా, స్వేచ్ఛగా ఉండేవని ఆమె పాత జ్ఞాపకాలను పంచుకుంది ..

ప్రస్తుతం, రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన హాస్య రొమాన్స్ డ్రామా 'దే దే ప్యార్ దే 2' విజయంతో మంచి ఊపు మీద ఉంది. పెళ్లి తర్వాత తన కెరీర్‌లో కూడా రకుల్ మరింత దూకుడు చూపిస్తోంది. స్నేహితుల మధ్య ఇలాంటి చిన్న మార్పులు సహజమే అయినప్పటికీ తమ బంధం బలంగానే ఉంటుందని లక్ష్మీ మంచు తన మాటల్లో స్పష్టం చేసింది..