
అమెరికా రక్షణశాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలను, యుద్ధ ప్రణాళికలను లీక్ చేసిన 21ఏళ్ల యువకుడి అరెస్టు చేశారు. నిందితుడిపై గూఢచర్యం నేరం మోపారు. శుక్రవారం (ఏప్రిల్ 14వ తేదీన) మస్సాచుసెట్స్‌లోని బోస్టన్ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనున్నారు. నిందితుడు అమెరికా ఎయిర్ నేషనల్ గార్డ్ జాక్ టీక్సీరా అనే యువకుడిగా గుర్తించారు.
మస్సాచుసెట్స్‌లో తన ఇంట్లో ఉండగా.. ఎఫ్‌బీఐ అధికారులు ముట్టడించి.. జాక్ ను అదుపులోకి తీసుకున్నారు. షార్ట్, టీషర్ట్‌లోనే ఉన్న జాక్ ను అమెరికా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
మస్సాచుసెట్స్ 102 ఎయిర్ నేషనల్ గార్డ్ ఇంటెలిజెన్స్ విభాగంలో జాక్ ఉద్యోగం చేస్తున్నాడు. 2019లో జాయిన్ అయ్యాడు. పశ్చిమ కేప్‌కోడ్‌లోని ఒటిస్ నేషనల్ ఎయిర్‌గార్డ్స్ కార్యాలయంలో సైబర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ జర్నీమెన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
అమెరికాకు చెందిన మిలటరీ సమాచారాన్ని జాక్.. ఆన్ లైన్ లో లీక్ చేశాడని గుర్తించారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన క్లాసీఫైడ్ సమాచారం ఆన్‌లైన్ చాట్ గ్రూపులో ముందుగా గుర్తించారు. ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కావడంతో జాతీయ భద్రతకు కూడా ప్రమాదం అవుతుందని అమెరికా అంచనా వేస్తోంది.
అమెరికా రహస్య పత్రాలను ఫస్ట్ టైమ్ మార్చి 1వ తేదీన ‘డిస్కార్డ్’ అనే సోషల్ మీడియా వేదికపై కనిపించాయి. డిస్కార్డ్‌ను ఎక్కువగా వీడియో గేమర్లు చాట్ రూమ్‌ల కోసం వినియోగిస్తుంటారు. వీటిల్లో మైన్‌క్రాఫ్ట్ అనే గేమ్ కోసం.. ఫిలిప్పినో యూట్యూబర్ కోసం ఏర్పాటు చేసిన చాట్ రూమ్‌ల్లో ఇవి కనిపించాయి.