దళిత మహిళపై అత్యాచారం.. హత్య చేసి పరార్

దళిత మహిళపై అత్యాచారం.. హత్య చేసి పరార్
  • ఉత్తరప్రదేశ్​లో దారుణం

లక్నో: పిండి మిల్లును శుభ్రం చేసేందుకు వచ్చిన నలభై ఏండ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. ఆపై ఆమె శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్​లోని బండా అనే గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. మిల్లుకు వెళ్లిన తల్లి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె 20 ఏండ్ల కూతురు అక్కడికి వెళ్లింది. తలుపు తీసి చూసేసరికి తన తల్లి డెడ్​బాడీ రక్తపు మడుగులో పడి ఉందని ఆ యువతి సమాచారం అందించింది అని పోలీసులు తెలిపారు. 

దీంతో పిండి మిల్లు ఓనర్ రాజ్​కుమార్ శుక్లా, అతని సోదరులు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తాము స్పాట్​కు వెళ్లేసరికి నిందితులు పరారయ్యారన్నారు. ఈ ఘటనపై సమాజ్​ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్​ యాదవ్ స్పందిస్తూ యూపీ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ట్వీట్ చేశారు.