వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో దారుణం జరిగింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. అసలేం జరిగిందంటే.? వనస్థలిపురం చింతలకుంటకు చెందిన సమీన బేగం మూడు రోజుల క్రితం పురిటి నొప్పులతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో చేరింది గర్భిణీ. మూడు రోజుల నుంచి ఎంత ప్రాధేయపడిన హాస్పిటల్ సిబ్బంది,వైద్యులు పట్టించుకోలేదు. చివరకు ఇవాళ డిసెంబర్ 5న గర్బిణికి ఆపరేషన్ చేయగా బాలుడు మృతి చెందాడు.
దీంతో ఆస్పత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు గర్భిణీ బంధువులు, కుటుంబ సభ్యులు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్స్, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనతో ఏడాదిలోనే చిన్నారులు మృతి చెందడం నాలుగోసారి. గతేడాది పుట్టిన బిడ్డ సిబ్బంది చేతిలో నుంచి జారిపడి మృతి చెందింది. వరుస ఘటనలతో ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు ఆందోళన చెందుతున్నారు.
