మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ

మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ

మైలార్ దేవ్ పల్లిలో భారీ చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన దొంగలు.. పోలీసులకు సవాలు విసిరారు. స్థానిక దుర్గా నగర్ ప్రాంతంలో కూడా గత నాలుగు రోజుల క్రితం ఇదే తరహాలో చోరీ జరిగింది. ఆ సంఘటన మరువవక ముందే దొంగలు మరో ఇంటిని టార్గెట్ చేసి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓం ప్రకాష్ అగర్వాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి దుర్గా నగర్ లో ఉంటున్నాడు. ఓం ప్రకాష్ అగర్వాల్ కాటేదాన్ లోని ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. బుధవారం ఓం ప్రకాష్ ఉద్యోగానికి వెళ్లిన తర్వాత.. అతని భార్య పిల్లలను తీసుకొని కాటేదాన్ లోని బందువుల ఇంటికి వెళ్ళింది. ఒకవైపు తాళం వేసి.. మరోవైపు లోపలి నుంచి గడియపెట్టి వెళ్లింది. అది గ్రహించిన దొంగలు.. గడియపెట్టిన తలుపులను విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలో దాచి ఉంచిన ఏడు తులాల బంగారం, 400 గ్రాముల వెండి, రూ.35,000 నగదు అపహరించుకుని పోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ఓం ప్రకాష్ భార్య తలుపులు తీసి ఉండటంతో.. ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగలు పడ్డారని గ్రహించింది. వెంటనే భర్తకు విషయాన్ని తెలియజేసి.. మైలార్ దేవ్ పల్లి పోలీసులకు సమాచారం అందజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం సంఘటన స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓం ప్రకాష్ కూడా తన ఇంటి చుట్టు పక్కల ఉన్న వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

కొన్ని కులాలే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నాయి

గన్ పార్క్ వద్ద బీజేపీ మహిళా మోర్చా నిరసన

సాయం కోసం ఒక్కరోజే 31 వేల మెస్సెజ్ లు