పరీక్షల గురించి విద్యార్థులు టెన్షన్ పడొద్దు : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా 

పరీక్షల గురించి విద్యార్థులు టెన్షన్ పడొద్దు : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా 

హైదరాబాద్, వెలుగు: పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులు మార్కుల కోసం ఆందోళన చెందొద్దని, ప్రాక్టీస్​పై దృష్టి పెట్టాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సూచించారు. సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో టీ-సాట్ ద్వారా టెన్త్ విద్యార్థుల కోసం స్పెషల్ మోటివేషన్, గైడెన్స్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమం నిర్వహించారు.

పరీక్షలపై భయం వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని ఆమె పిలుపునిచ్చారు. చదివిన అంశాలను పేపర్ మీద రాసి ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటాయని తెలిపారు.