హకీంపేట్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

హకీంపేట్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

హైదరాబాద్: హకీంపేట్ లో స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్స్ కి జాతీయ జెండాలు కట్టి  ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సైనికులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. హర్ ఘర్ తిరంగా నినాదంతో కమాండెంట్ ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సైనికులు పెద్ద ఎత్తున దేశభక్తిని చాటేలా నినాదాలు చేశారు. 

కాగ... ఈ ఆగస్టు 15 తో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇండిపెండెన్స్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు.  స్వతంత్ర భారత వజ్రోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ సంబరాలను నిర్వహిస్తున్నాయి.