ఉత్తరాఖండ్ ను కప్పేసిన మంచు దుప్పటి 

ఉత్తరాఖండ్ ను కప్పేసిన మంచు దుప్పటి 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మంచు దుప్పటి కప్పేసింది. భారీగా కురుస్తున్న మంచు బద్రినాథ్ ఆలయ పరిసరాలను ముంచెత్తుతోంది. ఎటు చూసినా మంచు కప్పేసిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. శీతాకాలం కావడంతో ఇప్పటికే బద్రినాథ్ ఆలయానికి భక్తుల రాకపోకలను నిలిపేశారు. మరో వైపు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో చమోలీలో పర్యటిస్తున్నారు. మంచులో ట్రెక్కింగ్ చేస్తూ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు.