
రోమ్‌మధ్యదరా సముద్రంలో బోట్ బోల్తా పడి 41 మంది మృతిచెందారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటాలియన్ ఐల్యాండ్ లాంపెడుసా వద్ద ఈ ప్రమాదం జరిగిందని బుధవారం అధికారులు తెలిపారు.
ట్యునీషియాలోని స్ఫాక్స్ ప్రాంతం నుంచి గత గురువారం ఉదయం వలసదారులతో ఓ బోట్ బయలుదేరిందని, ఆ తర్వాత కొన్ని గంటలకే అది సముద్రంలో మునిగిపోయిందన్నారు. ప్రాణాలతో బయటపడ్డ నలుగురిని ఓ కార్గో షిప్ సిబ్బంది కాపాడి, ఇటాలియన్ కోస్ట్ గార్డ్‌కు తరలించారని ఇటాలియన్ స్టేట్ ఆర్‌ఏఐ టెలివిజన్ వెల్లడించింది.
వీరిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, మరో మైనర్ ఉన్నాడని, వీరు గినియా నుంచి వచ్చారన్నారు. బోట్‌లో మొత్తం 45 మంది ఉన్నారని, ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా 41 మంది చనిపోయారని ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు తెలిపారు.