
- బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించిన పోలీసులు
గండిపేట్, వెలుగు: చిట్టి డబ్బులు కట్టేందుకు వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బండ్లగూడకు చెందిన దస్తగిరి, నాగమణి దంపతుల కొడుకు చరణ్ స్థానిక ప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
కొడుకుకు తల్లి నాగమణి రూ. 2,500 ఇచ్చి అదే బస్తీలో చిట్టీలు వేసే వ్యక్తికి ఇచ్చి కట్టి రమ్మని పంపింది. చిట్టీలు తీసుకునే వ్యక్తి లేకపోవడంతో బాలుడు దారి తప్పిపోయాడు. కొడుకు అర్ధరాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మెహిదీపట్నం బస్ డిపో వద్ద చరణ్‌ను గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు.