భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రుచులన్నీ పక్కదేశాల్లో కూడా దొరుకుతున్నాయి. అక్కడ కూడా వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే, వాటని నడుపుతున్నావాళ్లంతా భారత సంతతి వాళ్లే ఉంటారు. కానీ, లండన్ లో మాత్రం కాస్త వ్యతిరేకం. బ్రిటన్ చెఫ్ అంగస్ డెనూన్ కోల్ కతా ఫేమస్ డిష్ ని లండన్ లో హోటల్ పెట్టి అమ్ముతున్నాడు. అతని ఫుడ్ స్టాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్నేండ్ల క్రితం అంగస్ కోల్ కతాకు వచ్చాడు. అక్కడి ఝల్మేరి (బేల్ పూరి లాంటి చాట్) అతన్ని బాగా ఆకర్శించింది. దాంతో లండన్ కు తిరిగి వెళ్లిన వెంటనే ఝల్మురి ఎక్స్ ప్రెస్ పేరుతో ఫుడ్ స్టాల్ ని ప్రారంభించాడు. దాంతో యునైటెడ్ కింగ్‌డమ్ వీధుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఐటమ్ గా ప్రసిద్ధిపొందింది. దీని గురించి రిచ్ మైండ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సీఈఓ రవి నాయర్ తన లింక్డిన్ అకౌంట్లో పోస్ట్ చేశాడు
