హజ్ యాత్రకు వెళ్తున్న బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం

హజ్ యాత్రకు వెళ్తున్న బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం

సౌదీ అరేబియాలో దారుణం చోటు చేసుకుంది. హజ్ యాత్రకు వెళ్తున్న బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అక్కడి వార్తా పత్రిక వివరించిన దాని ప్రకారం.. వంతెన పైనుంచి వెళ్తున్న బస్సు.. పక్కనే ఉన్న డివైడర్ గోడను బలంగా ఢీకొట్టింది. దాంతో అదుపు తప్పి బోల్తా పడింది. అసిర్‌ ప్రావిన్స్‌ లో ఉన్న అకాబత్‌ షార్‌ రహదారిపై మార్చి 27న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హజ్ యాత్రికుల బస్సు ఖమీస్‌ ముషైత్‌ నుంచి అభాకు బయలు దేరింది. 

అయితే, మార్గ మధ్యలో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

సామాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ రహదారి పర్వతాల గుండా వెళ్తుంది. అందులో 11 సొరంగాలు, 32 వంతెనలు కల్గి ఉంది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా కొట్టగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.