శంభీపూర్లో గోడెక్కిన కారు

  శంభీపూర్లో గోడెక్కిన కారు

దుండిగల్, వెలుగు: దుండిగల్ పరిధిలోని శంభీపూర్​లో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఇంటి గోడను ఢీకొట్టింది. ఆపై గాల్లో గోడపైనే ఆగింది. ఈ ఘటనతో సదరు ఇంట్లోని కుటుంబీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్​అక్కడ్నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్రేన్​ సాయంతో కారును కిందకు దించారు. డ్రైవర్​మద్యం మత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.