సైదాబాద్లో కారు బీభత్సం..నాలుగు బైకులను ఢీకొట్టి పరార్

సైదాబాద్లో  కారు బీభత్సం..నాలుగు బైకులను ఢీకొట్టి పరార్

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. సైదాబాద్ జయనగర్ ప్రధాన రహదారిపై తెల్లవారుజామున  నాలుగు బైకులను ఢీకొట్టింది ఇన్నోవా కారు.  ఈ ఘటనలో  బైక్ పై వెళ్తున్న ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల అంబులెన్స్ లో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కార్ అపకుండానే వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.