క్రిశాంక్​పై కేసు నమోదు

క్రిశాంక్​పై కేసు నమోదు

మాదాపూర్, వెలుగు: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్​పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్ ఇన్​స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అతని సోదరుడు తిరుపతిరెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఈ నెల 16న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బుధవారం క్రిశాంక్​కు 41 సీఆర్సీసీ నోటీసులు ఇచ్చి, అతని ఫోన్ ని సీజ్ చేశారు.