పొలాల్లోకి చిరుత...ఆందోళనలో ప్రజలు

పొలాల్లోకి చిరుత...ఆందోళనలో ప్రజలు

తెలంగాణలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఓ జిల్లాలో పులి సంచారం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో జగిత్యాల జిల్లా, మల్లాపూర్  మండలం సంగెం, ఓబులాపూర్ గ్రామాల మధ్య  చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది.  . గత వారం రోజుల నుండి  చుట్టు ప్రక్కల ప్రాంతాలలో  చిరుత పులులు ఎక్కువగా తిరుగుతున్నయని స్థానికులు వెల్లడించారు. ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిరుతపులి పొలం పనులకు వెళ్లగా చిరుత  కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.  అయుతే ఈ విషయాన్ని ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్దారించలేదు.  ముదస్తు జాగ్రత్తగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

స్థానికులు గ్రామస్తులు సమాచారం అందించడంతో వెంటనే అటవి శాఖ అధికారులు రంగంలోకి దిగారు.ఈ ప్రాంతంలో చిరుత పులులను బంధించేందుకు   చర్యలు తీసుకుంటామనిఫారెస్ట్ అధికారులు తెలిపారు . చిరుత పులులు సంచారం చేస్తుండడంతో ప్రజలు  భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిరుత పులులను అటవీ శాఖ అధికారులు త్వరగా గుర్తించి బంధించాలని ప్రజలు కోరుతున్నారు

ఈ మధ్య కాలంలో చిరుతలు అటవీ ప్రాంతాన్ని జనావాసాలవైపు తిరుగుతున్నాయి.  దీంతో చిరుత సంచరించే  ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  మనుషులు విహార యాత్రకు వెళ్లిన విధంగా.. అవి కూడా గ్రామాలను చూసేందుకు వస్తున్నాయా..అనే అనుమానాలు కలుగుతున్నాయి.  అలా వచ్చే వాటిని బంధించి మళ్లీ ఫారెస్ట్ లో వదిలేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా చిరుత సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.