లంచంగా మరికొంత కావాలన్నాడు. చివరికి ఏసీబీకి చిక్కాడు

లంచంగా మరికొంత కావాలన్నాడు. చివరికి ఏసీబీకి చిక్కాడు

హైదరాబాద్: మున్సిపల్ ఆఫీస్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ అవినీతి అధికారి. ఓ కాంట్రాకర్ కు  బిల్లులు మంజూరు చేయాల్సిన విషయంలో కాంట్రాక్టర్ కు ఇచ్చే మొత్తంపై 7 శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్ అకౌంట్ సెక్షన్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్న  రాజేందర్ రెడ్డి  ఓ కాంట్రాక్టర్ ను లంచం ఇమ్మని డిమాండ్  చేశాడు.  అంతకుముందే అతని వద్ద నుంచి రూ. 1.20 లక్షలు తీసుకున్న రాజేందర్.. ఫైనల్ సెటిల్ మెంట్ గా మరో రూ.20 కావాలన్నాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా.. అధికారులు శుక్రవారం మున్సిపల్ ఆఫీస్ లో తనిఖీలు నిర్వహించారు. కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రాజేందర్ ను పట్టుకున్నారు.

A corrupt official caught by ACB for bribing in Bodupal Municipal Office