సాధారణంగా ప్లేట్ పూరీ ఎంత ఉంటుంది. రూ. 30. ప్లేట్ పూరీ అంటే ఎన్ని పూరీలు వేస్తారు. పెద్దవి అయితే రెండు. నార్మల్ సైజులో ఉంటే నాలుగు అంతేనా. కానీ ఓ టిఫిన్ సెంటర్లో ప్లేట్ పూరీ అని అడిగితే 10 పూరీలు వేస్తారు. 10 పూరీలు వేశారు కదా..రేట్ కూడా ఎక్కువే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఈ 10 పూరీలకు ఎంత తీసుకుంటారో తెలుసా..కేవలం రూ. 30 మాత్రమే. అవును..ఇది నిజం..అది ఎక్కడ అంటే..
కస్టమర్ల కడుపు నింపడమే లక్ష్యంః
రాజస్థాన్ జైపూర్ లో దంపతులు టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. ఈ టిఫిన్ సెంటర్లో కేవలం రూ.30లకే 10పూరీలు వేస్తారు. దీంతో పాటు సబ్జీ అందిస్తున్నారు. అలా రూ.30లకే 10పూరీలు కూర, రైతా కూడా అందిస్తున్నారు. అలాగే గిన్నె రైతాతో కలిపి కేవలం రూ.10రూపాయలకే భోజనం కూడా పెడుతున్నారు. ఈ భార్యాభర్తల పూరీల బిజినెస్ వీడియోను ‘Foodies.aao’ హ్యాండిల్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ దంపతుల స్ట్రీట్ ఫుడ్ వీడియోకు 926 వేల వ్యూస్ రాగా..5వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
రుచిగా..తక్కువకు...
భార్యాభర్తలు పొద్దున్నే 7.30గంటలకు తమ టిఫిన్ సెంటర్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2గంటల వరకు అలూ సబ్జీని అమ్ముతారు. పూరీలతో పాటు..ఆలూ సబ్జీ లేదా చోలే వారికి నచ్చింది వేసుకోవచ్చు. ధర రూ. 30 మాత్రమే. కష్టమర్ కు పూరీలు వేడి వేడిగా అప్పటికప్పుడే వేసి ఇస్తారు. పూరీలే కాదు.. కష్టమర్లకు భోజనాన్ని అందిస్తారు. తమ దగ్గరకు వచ్చే కస్టమర్లను దేవుళ్లుగా చూస్తూ..వారి కడుపు నింపడమే పనిగా పెట్టుకున్నారు.

