
జగిత్యాల : ఓ ప్రేమజంటకు ప్రభుత్వ ఆస్పత్రిలో పెళ్లి చేశారు వారి గ్రామపెద్దలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన యువకుణ్ని ప్రేమించింది. ఆ యువకుడితో తన పెళ్లికాదేమోనన్న భయంతో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఆ యువతిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ప్రేమను అర్దం చేసుకున్న గ్రామపెద్దలు ఆసుపత్రిలోనే ఆ యువకుడితో పెళ్లి జరిపించారు