- పిటిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌పోర్టు అథారిటీ సేకరించిన భూముల్లోc 97 ఎకరాలు ఆక్రమణకు గురవుతోందని, నిర్మాణాలకు అధికారులు అనుమతులు కూడా ఇచ్చారని చేసిన ఫిర్యాదును అధికారులు పట్టించుకోలేదంటూ దాఖలైన పిల్ పై సోమవారం హైకోర్టు విచారణను ముగించింది. పిటిషనర్ ఆరోపిస్తున్న అంశాలకు తగిన ఆధారాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇప్పటికే సమర్పించిన వినతిపత్రంలో వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని.. తిరిగి అధికారులకు 4 వారాల్లోగా ఫిర్యాదు చేయాలని, దానిపై రంగారెడ్డి కలెక్టర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మునిసిపాలిటీ, మంఖల్ లో సర్వే నంబర్ 93, 94, 95, 770, 771, 772, 773, 778, 779లోని 97.06 ఎకరాల ఆక్రమణపై ఆధారాలు, పూర్తి వివరాలతో మరోసారి ఫిర్యాదు చేయాలంది.
ఎయిర్ట్ భూముల ఆక్రమణపై మూడుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన కుక్కల కృష్ణ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. అడ్వకేట్ వాదిస్తూ.. ఎయిర్‌పోర్టు భూములను వెర్టెక్స్ డెవలపర్స్ ఆక్రమించిందని, దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ 2023 జులై 6న, గతేడాది ఫిబ్రవరి 20న, ఆగస్టు 28న మూడుసార్లు పిటిషనర్ వినతిపత్రం సమర్పించారన్నారు. ఏండ్లు గడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ప్లాట్లు చేసుకునేందుకు లే–అవుట్ అనుమతి మంజూరు చేశారన్నారు. హెచ్‌ఎండీఏ మంజూరు చేసిన అనుమతిని రద్దు చేయాలని, భూమిపై దర్యాప్తు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉంది? సర్కార్ భూమి ఎంత? ప్రైవేట్ భూమి ఎంత? ఆక్రమణ వివరాలు ఇలా ఫిర్యాదులో వివరాలు స్పష్టంగా పేర్కొంది.
