
భద్రాచలం, వెలుగు : వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ సీఆర్‍పీఎఫ్ కానిస్టేబుల్ తన భార్యకు రెడ్‍హ్యాండెడ్‍గా దొరికిపోయాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన సుభాశ్ అనే సీఆర్‍పీఎఫ్ కానిస్టేబుల్‍కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన యువతితో పెండ్లయ్యింది. ఏడాది నుంచి వేరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ విషయంలో కుటుంబంలో గొడవలవుతున్నాయి.ఆదివారం సుభాశ్ సదరు యువతితో భద్రాచలంలోని గోపాలకృష్ణ థియేటర్‍వద్ద ఓ లాడ్జిలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య సౌజన్య కుటుంబసభ్యులతో కలిసి వచ్చి భర్తను రెడ్‍హ్యాండెడ్‍గా పట్టుకుంది. తర్వాత ఆమె కుటుంబ సభ్యులు సుభాశ్తో పాటు యువతిని కూడా చితకబాదారు. పీఎస్లో అప్పగించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.