‘గీతా సుబ్రమ‌‌ణ్యం’ ఫేమ్ మనోజ్ కృష్ణ హీరోగా ‘ఏ కప్‌‌ ఆఫ్‌‌ టీ’ సినిమా

‘గీతా సుబ్రమ‌‌ణ్యం’ ఫేమ్ మనోజ్ కృష్ణ  హీరోగా ‘ఏ కప్‌‌ ఆఫ్‌‌ టీ’ సినిమా

‘గీతా సుబ్రమ‌‌ణ్యం’ ఫేమ్ మనోజ్ కృష్ణ త‌‌న్నీరు హీరోగా న‌‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘ఏ క‌‌ప్ ఆఫ్ టీ’. ఈ చిత్రంతో  ఎఫ్పీ రోజ‌‌ర్స్‌‌, నిఖిత రావు ద‌‌ర్శకులుగా ప‌‌రిచ‌‌య‌‌మ‌‌వుతున్నారు. మ‌‌నోజ్ కృష్ణ, న‌‌వీన్ కృష్ణ నిర్మిస్తున్నారు.  జ‌‌య శ్రీ హీరోయిన్‌‌గా న‌‌టిస్తోన్న ఈ మూవీలో న‌‌టుడు రాకేష్  కీల‌‌క పాత్ర పోషిస్తున్నాడు.  తాజాగా ఈ మూవీ నుండి  ‘వాట్ హ్యాపెండ్’ అనే  ప్రమోష‌‌న‌‌ల్ సాంగ్‌‌ని రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో మనోజ్ మాట్లాడుతూ ‘ఈ పాట‌‌తో మా సినిమాని ప్రమోట్ చేసి థియేటర్స్ వ‌‌ర‌‌కు  తీసుకెళ్లాలనేది మా టార్గెట్. పెద్ద సినిమాల వ‌‌ల్ల చిన్న సినిమాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఈ సాంగ్‌‌లో ఫన్నీగా చూపించాం. ఈ సినిమా ఒక యంగ్‌‌స్టర్ జ‌‌ర్నీ. కాలేజీ యువ‌‌త జ‌‌ర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది. అది ఎలా డీవియేట్ అవుతుంది. దాని వ‌‌ల్ల వ‌‌చ్చే ప‌‌రిణామాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని చెప్పాడు.

మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రవిజ్‌‌ మాట్లాడుతూ ‘మాది చిన్న సినిమా అయినా మ్యూజిక్‌‌, మేకింగ్‌‌కి చాలా ఖ‌‌ర్చు పెట్టాం.  పాట‌‌లు, బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వ‌‌చ్చింది’ అని అన్నాడు. ఇదొక బ్యూటిఫుల్ లవ్‌‌ స్టోరీ అని, యువతకు తప్పకుండా కనెక్ట్ అవుతందని టీమ్ చెప్పింది.