ఉన్నభూమి లాక్కుంటే బతికేదెలా?..సెల్ఫీ వీడియోలో దళిత రైతు ఆవేదన

ఉన్నభూమి లాక్కుంటే బతికేదెలా?..సెల్ఫీ వీడియోలో దళిత రైతు ఆవేదన

సూర్యపేట జిల్లాలో పల్లె ప్రకృతి వనం పేరుతో  భూమి లాక్కుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఓ దళిత రైతు. ఆత్మకూరు(ఎస్) మండలం పాత సూర్యాపేటలో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని పల్లె ప్రకృతి వనం పేరుతో లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. ఉన్నత వర్గాల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములు వదిలేసి.. దళితుడినైన తనపై దౌర్జన్యం చేస్తున్నారంటూ.. సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. దళితులకు భూమి ఇవ్వటం అటుంచి.. ఉన్న భూమిని లాక్కోవటమేంటని ప్రశ్నించాడు యువరైతు.