భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్‌! ప్రస్తుతం ఆ మోడల్తో డేటింగ్

భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్‌! ప్రస్తుతం ఆ మోడల్తో డేటింగ్

పంజాబ్‌ కు చెందిన ప్రముఖ రాపర్ సింగర్ యో యో హనీ సింగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వివాహా బంధానికి ముగింపు పలికారు. తాజాగా యో యో హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్‌లకు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 

జనవరి 2011లో షాలిని తల్వార్‌ను హనీ సింగ్ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం హ్యాపీగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. చాలా సార్లు ఇద్దరి మధ్క గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే 2021లో తన భర్త హనీ సింగ్‌పై షాలిని గృహ హింస కేసు పెట్టింది.

అంతేకాకుండా అతనికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది. ఈ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో షాలినికి కోటి రూపాయల చెక్కును భరణంగా ఇచ్చారు హనీ సింగ్. 

సింగర్ హనీ సింగ్ ప్రస్తుతం నటి, మోడల్ టీనా థడానీతో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హనీ సింగ్ పంజాబీతో పాటు హిందీ, హాలీవుడ్ సినిమాలకు పాటలు పాడారు. అతని అసలు పేరు హిర్దేశ్ సింగ్ ..  యో యో హనీ సింగ్‌ పేరుతో ఫేమస్‌ అ‍య్యారు. అతను 2003లో రికార్డింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత  పంజాబీ సంగీతంలో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.