
తిరుమల తిరుపతిని అపవిత్రం చేస్తున్నారు కొందరు భక్తులు. మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల కళ్లుగప్పి వోడ్కాతో దర్శనమిచ్చాడు. వాటర్ బాటిల్ లో వోడ్కాను కలిపి తిరుమలకు తెచ్చాడు. ఎస్ఎన్జీ రూం నెంబర్ 28లో మద్యంతో కనబడిన అతన్ని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.