వావ్.. హార్ట్ పేషంట్ ను కాపాడిన కుక్క.. రివార్డ్ ప్రకటించిన అగ్నిమాపక సిబ్బంది

వావ్.. హార్ట్ పేషంట్ ను కాపాడిన కుక్క.. రివార్డ్ ప్రకటించిన అగ్నిమాపక సిబ్బంది

ఇప్పటి వరకు నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేసే శునకాలు తాజాగా గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా మారింది.  అంతే కాదు అవార్డును కూడా సాధించి అందరి మనస్సులో స్థానం సంపాదించింది.  ప్రపంచవ్యాప్తంగా ఈ శునకం ప్రశంసలు పొందుతోంది.

వివరాల్లోకి వెళితే..

గుండెపోటుతో తల్లడిల్లుతున్న వ్యక్తి ప్రాణాలను శనకం కాపాడింది. ఈ ఘటన జపాప్‌లోని చిబా నగర సమీపంలో చోటుచేసుకుంది. వాకబాకు ఏరియాలో ఉన్న ఓ గుర్రపు స్వారీ క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తికి  స్వారీ సమయంలో  గుండెపోటుకు  గురై ఒక్కసారిగా  కుప్పకూలిపోయాడు. ఈ సమయంలో కౌమే అనే కుక్క అతడిని చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది.

శునకానికి ప్రశంసలు

కుక్క అరుపుతో క్లబ్ లోని వారందరూ  వ్యక్తి పడిపోయి ఉన్న ప్రాంతానికి వెళ్లారు.  దీంతో అతడిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వెంటనే చికిత్స అందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే ఆసుపత్రికి తరలించడం ఆలస్యం అయి ఉంటే ఈ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గట్టిగా అరిచి వ్యక్తి ప్రాణాలు కాపాడిన శునకాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

రివార్డు ప్రకటించిన అగ్నిమాపక సిబ్బంది

ఈ క్రమంలో శునకాన్ని అగ్నిమాపక సిబ్బంది అభినందించారు. శునకానికి ప్రశాంసాపత్రాన్ని అందించడంతో పాటు రివార్డు ప్రకటించారు. అయితే ఈ శునకం ఎప్పుడూ ఆ క్లబ్ లోనే ఉంటుందట. ఇది ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుందని, అత్యవసర సమయాల్లో మాత్రమే గట్టిగా అరుస్తుందని క్లబ్ నిర్వాహకులు చెబుతున్నారు. గతంలోనూ ఒక గుర్రం కంచె దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఇలాగే అరిచి తమను అప్రమత్తం చేసిందని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. గతంలోనూ చాలాసార్లు తమకు సహాయం చేసిందని అంటున్నారు.