కోడేరు, వెలుగు: విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతిచెందాడు. కోడేరు ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రాసోజీ వడ్ల వెంకటస్వామి(58) బుధవారం వరి పంటకు నీళ్లు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేస్తున్న సమయంలో ఎడమ చేతి వేళ్లకు విద్యుత్ వైరు తగలడంతో స్పాట్లో మృతిచెందాడు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.
