సీఐ రవిపై కేసు నమోదు

సీఐ రవిపై కేసు నమోదు

కంప్లయింట్​ ఇచ్చిన భర్త కేసు నమోదు 

హనుమకొండ సిటీ, వెలుగు : ఒకే విభాగంలో పనిచేసే మహిళా సీఐ ఇంట్లో ఆమె భర్త లేని టైంలో మరో సీఐ ఉండడంతో ఆమె భర్త పోలీసులకు కంప్లయింట్​ఇచ్చాడు. మహిళా సీఐ వరంగల్ సీఐడీ విభాగంలో పనిచేస్తుండగా, ఇదే విభాగంలో బి రవి సీఐగా ఉన్నారు. మహిళా సీఐ భర్త కూడా మహబూబాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ సీఐగా ఉన్నారు. సోమవారం సాయంత్రం మంగ భర్త రాంనగర్ లోని తన ఇంటికి రాగా ఇంట్లో రవి ఉండడంతో అతడిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులకు సంబంధించిన విషయం కావడంతో గోప్యంగా ఉంచారు. సీఐ రవిపై అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించారనే సెక్షన్​ కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. వీటితో పాటు ఐపిసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సుబేదారి పోలీసులు తెలిపారు.