పండగ లాంటి సినిమా.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

పండగ లాంటి సినిమా.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

శివాజీ,  లయ  జంటగా సుధీర్ శ్రీరామ్ రూపొందించిన చిత్రం   ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.  90'స్ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రిన్స్,  అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ కీలకపాత్రలు పోషించారు. శివాజీ నిర్మించగా,  ఫిబ్రవరి 12 నుంచి ఈటీవీ విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శివాజీ మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ ఫిల్మ్. అందరూ ఎంజాయ్ చేసే పండగ సినిమాలా ఉంటుంది.  ఇందులో  చాలా పాపులర్ ఆర్టిస్టులు ఉన్నారు. యాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా బాగా సపోర్ట్ చేశారు. ఆడియెన్స్  కచ్చితంగా సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నాడు. 

 లయ మాట్లాడుతూ ‘శివాజీ గారితో   ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేశాం.  ‘మిస్సమ్మ’లో రత్నమాలగా గుర్తుంచుకున్న ప్రేక్షకులు ఇకపై ఉత్తరగా గుర్తు పెట్టుకుంటారు. ఇది నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పెషల్ క్యారెక్టర్ అవుతుంది’ అని చెప్పింది.  ఇటీవల శివాజీ నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయని, ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని ప్రిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చెప్పాడు.  దర్శకుడు సుధీర్, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, సింగర్ భోలే షావలి, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ పాల్గొన్నారు.