
రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే జగిత్యాల జిల్లాలో కొన్ని గ్రామాల్లో లాక్‌డౌన్ విధిస్తూ గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయి. తాజాగా మల్లాపూర్ మండలం కొత్త ధాంరాజ్ పల్లి, గొర్రెపల్లి, సిరిపూర్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతుండంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ నెల 20 వరకు లాక్‌డౌన్ విధిస్తునట్లు పాలకవర్గాలు తమ తీర్మానంలో పేర్కొన్నాయి. తీర్మానం ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కిరాణా, కటింగ్ షాప్స్ తెరిచి ఉంచాలని నిర్ణయించారు. షాపులకు వచ్చే వారికి మాస్కులు ఉంటేనే.. దుకాణాదారులు వస్తువులు ఇవ్వాలన్నారు. ఎవరైన రూల్స్ బ్రేక్ చేస్తే 1000 రూపాయల జరిమాన విధించనున్నట్లు తెలిపారు.