
అయిజ, వెలుగు: హరితహారం మొక్కలు నరికిన వ్యక్తికి అయిజ మున్సిపల్ ఆఫీసర్లు శుక్రవారం రూ.50 వేల ఫైన్ వేశారు. ఆఫీసర్ల వివరాల ప్రకారం.. టౌన్‌లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఆంధ్రప్రదేశ్.. కర్నూల్‌జిల్లాకు చెందిన కార్పొరేట్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్బోర్డు ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం బోర్డు ముందు నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి అడ్వర్టైజ్మెంట్బోర్డును కమ్మేశాయి. బోర్డు కనిపించడం లేదని హాస్పిటల్‌కు చెందిన రాంబాబు శుక్రవారం చెట్లను నరికి వేశాడు. హరితహారం మొక్కలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, వాటికి జియోట్యాగింగ్‌చేసి కాపాడుతోంది. చెట్ల నరికివేత విషయం తెలుసుకున్న మున్సిపల్ఆఫీసర్లు ఆరా తీసి వ్యక్తిని గుర్తించి అతడికి రూ.50 వేల ఫైన్వేశారు. మరోసారి ఇలాంటి పనులకు పాల్పడితే కేసులు పెడతామని హెచ్చరించారు.