అందంగా ముస్తాబయిన కరీంనగర్ కోట బురుజు

అందంగా ముస్తాబయిన కరీంనగర్ కోట బురుజు

చరిత్ర చెప్పే కోట బురుజు.. దానిపై ఇరవై అడుగుల ఎత్తులో రెపరెపలాడే జెండా.. ఏడాదంతా ఎగురుతూనే ఉంటుంది. ఈ కోట బురుజు కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్​లో ఉంది. బురుజుకు నాలుగువైపులా అద్దుకున్న జెండాలోని మూడు రంగులు మరింత అందాన్ని తెచ్చాయి. దాదాపుగా150 ఏండ్ల కిందట నిజాం రాజులు ఈ కోట బురుజు కట్టారు.

శత్రువుల నుంచి  గ్రామాన్ని కాపాడుకునేందుకు,  గ్రామంలోకి కొత్తవాళ్లు ఎవరైనా వస్తే ఆ విషయం తెలుసుకునేందుకు... ఒక్కమాటలో చెప్పాలంటే నిఘా కోసం ఈ బురుజు కట్టారట. ఈ మధ్య దీనికి కొన్ని మరమ్మత్తులు చేసి రెయిలింగ్ కట్టారు.  దాంతో బురుజు పైకి ఎక్కడం ఈజీ అయింది.  ఈ బురుజు మీద20 అడుగుల జెండా స్తంభం ఏర్పాటుచేసి, జాతీయ జెండా ఎగరేశారు. ఇక్కడికి వెళ్లగానే ఐ లవ్​ ఇండియా అంటూ అక్షరాల స్కల్ప్చర్​ వెల్​కం చెప్తుంది. ఊరికి స్పెషల్​ అట్రాక్షన్​గా మారిన కోట బురుజుపై మీరూ ఓ లుక్కేయండి.
::: గంగాధర, వెలుగు