మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. రిజల్ట్ మరింత ఎఫెక్టివ్గా ఉండాలంటే మార్నింగ్ వాక్ తర్వాత తినే ఫుడ్ కూడా కరెక్ట్ ఉండాలి.
• మార్నింగ్ వాక్ తరువాత ఎనర్జీ కోసం అరటి పండ్లు తినాలి. దీనివల్ల శరీరానికి సరిపడా కేలరీలు అందుతాయి.
• జాగింగ్, వాకింగ్.. తర్వాత పుచ్చకాయ తిన్నా ఆరోగ్యానికి మంచిదే. వీటిల్లో ఉండే సిట్రులిన్, లైకోపిన్ బాడీని రిలాక్స్ చేస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి. సిట్రులిన్ నైట్రిక్ ఆక్సైడ్ ని విడుదల చేసి ఎక్సర్సైజ్ తర్వాత కలిగే అలసటని తగ్గిస్తుంది.
• మార్నింగ్ వాక్ తర్వాత ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ కూడా తాగొచ్చు. త్వరగా జీర్ణం అవుతుంది. ఇది వర్కవుట్ తర్వాత అలిసిపోయిన కండరాలని యాక్టివ్ చేస్తుంది.
ALSO READ : కాఫీ, టీ, కూల్ డ్రింక్.. ఈ మూడింట్లో దేని వల్ల దంతాలకు ఎక్కువ నష్టమంటే..?
• విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఆమ్లెట్ ని మార్నింగ్ వాక్ తర్వాత తినొచ్చు. ఇది వెయిట్ లాస్ కి మంచి మెడిసిన్.
• బాడీకి బూస్టింగ్ ఇవ్వాలంటే అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ప్రొటీన్ షేక్స్ తాగాలి.
• వాకింగ్ తర్వాత చికెన్ తింటే కండరాలకు మంచిది. అది కూడా కూరగాయలు, ఆకుకూరలతో తింటే మరింత హెల్దీ.
• ప్రొటీన్, క్యాల్షియం, సోడియం ఎక్కువగా ఉండే కాటేజ్ చీజ్ వాకింగ్ తర్వాత తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
