
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 687 ఫిర్యాదులు అందాయి. వాటిలో రెవెన్యూకు సంబంధించి 225, ఫుడ్, సివిల్‌సప్లయ్ కు 82, హౌసింగ్ కు 59, హోంశాఖకు సంబంధించి 47, పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కు 40, ఇతర విభాగాలకు సంబంధించి 234 ఉన్నాయి. నోడల్ ఆఫీసర్దివ్య దేవరాజన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు.
రాష్ట్రంలోని 145 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,600 మంది గెస్ట్‌లెక్చరర్ల సర్వీసును పొడిగించాలని పలువురు గెస్ట్లెక్చలర్లు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. పీరియడ్విధానాన్ని రద్దు చేసి 12 నెలలకు కన్సాలిడేటెడ్పే ఇవ్వాలని డాక్టర్కొర్రా ఈశ్వరలాల్ బృందం కోరింది. 2022లో కానిస్టేబుల్స్‌గా సెలక్ట్అయిన 170 మందికి ట్రైనింగ్ఆర్డర్ఇవ్వలేదని పలువురు వాపోయారు. తమను శిక్షణకు పిలిచి ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు.