20కి పైగా చోరీలు చేసిన దొంగల ముఠా అరెస్ట్

20కి పైగా చోరీలు చేసిన దొంగల ముఠా అరెస్ట్

పగటిపూట రెక్కీ నిర్వహించి,.. రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 లక్షల విలువచేసే  47.5 తులాల బంగారం, 2 కేజీల వెండి, ఎయిర్ గన్, రెండు కత్తులు, 3 బైకులు, 3 టీవిలతోపాటు చోరీకి ఉపయోగించే వస్తువులను  స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా  మణికందన్ అనే ముఠా చోరీలకు పాల్పడుతున్నారని  సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

తమిళనాడుకు చెందిన మణికందన్ అలియాస్ గణేష్ ఈ ముఠాను ఏర్పాటు చేశాడని తెలిపారు. మొత్తం నలుగురు వ్యక్తులతో మాదన్నపేటలో ఉంటూ ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 2017 నుంచి నిందితులు చోరీలకు పాల్పడుతున్నారన్నారు. పలు రాష్ట్రాల్లో ముఠాపై 27 కేసులున్నాయని సీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తితో పాటు భువనగిరికి చెందిన పిల్ల యాదయ్య అలియాస్ యాది, షేక్ సయ్యద్ అలియాస్ సలీమ్, ములుపొజు ఉపేంద్ర చారి అలిఆయస్ చారిలను సోమవారం మీర్ పేట్ లో అరెస్ట్ చేశామని భగవత్ తెలిపారు. ప్రధాన నిందితుడు  గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.