సైరన్ వేసిండు..కేసులో ఇరుక్కుండు

సైరన్ వేసిండు..కేసులో ఇరుక్కుండు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం వద్ద ఓ ప్రభుత్వ ఉద్యోగి కారు హల్చల్ చేసింది. చెక్ పోస్ట్ వద్ద  కారు డ్రైవర్ సైరన్ వేసి గేట్ ఓపెన్ చేయాలని పట్టుబట్టాడు. మీరెవరూ అని పోలీసులు అడగ్గా.. మా సార్ సిరిసిల్ల రెవెన్యూ శాఖలో పెద్ద ఉద్యోగి అని చెప్పాడు. దీంతో పోలీసులు కారును స్టేషన్ కు తరలించారు. వేములవాడ రాజన్న ఆలయంపైకి వెళ్లడానికి వెనుక భాగంలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ వాహనాలు తప్ప ఇతర వాహనాలను ఈ చెక్ పోస్ట్ గుండా అనుమతించడం లేదు.  ఈ క్రమంలో ప్రభుత్వ వాహనం స్టిక్కర్ తో  వచ్చిన డ్రైవర్ చెక్ పోస్ట్ గేట్ ఓపెన్ చేయాలని సిబ్బందిని అడిగాడు. వారు ఓపెన్ చేయకపోవడంతో.. తమ సార్ ప్రోటోకాల్ అధికారంటూ సైరన్ వేశాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా.. వారు వచ్చి కారును స్టేషన్ కు తరలించారు. వీఐపీ సైరన్ వాడినందుకు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేష్ వెల్లడించారు.