కల్యాణి ప్రియదర్శన్‍కి క్రేజీ ఆఫర్: రణ్‌వీర్ సింగ్ సరసన బాలీవుడ్ ఎంట్రీ? జాంబీ థ్రిల్లర్‌లో ఛాన్స్!

కల్యాణి ప్రియదర్శన్‍కి క్రేజీ ఆఫర్: రణ్‌వీర్ సింగ్ సరసన బాలీవుడ్ ఎంట్రీ? జాంబీ థ్రిల్లర్‌లో ఛాన్స్!

మలయాళ చిత్రసీమ నుంచి తనదైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న నటి కల్యాణి ప్రియదర్శన్ . ప్రస్తుతం ఈ బ్యూటీ కెరీర్ పరంగా పీక్స్ లో ఉంది. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ 'స్టార్ కిడ్' ట్యాగ్ కే పరిమితం కాలేదు. తన ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. 

తెలుగులో అఖిల్ సరసన 'హలో' సినిమాతో పరిచయమైనప్పటికీ, అక్కడ ఆశించిన స్థాయి బ్రేక్ రాకపోవడంతో ఆమె మలయాళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అక్కడ కథాబలం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంది. ఆ ప్రయాణానికి అసలైన మైలురాయిగా నిలిచింది. 'లోక చాప్టర్ 1 చంద్ర' మూవీ, ఫీమెల్ సెంట్రిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణి ఇంటెన్స్ యాక్షన్ లుక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.  మల యాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కళ్యాణి కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారింది.

►ALSO READ | Nayanthara vs Trisha : నయన్ వర్సెస్ త్రిష: సీనియర్ భామల మధ్య ‘సైలెంట్ వార్’.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు!

 ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ నటించనున్న జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ప్రళయ్ మూవీలో ఆమె లీడింగ్ లేడీగా కనిపించనుందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2026 ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం..  ఇప్పటికే సౌత్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ  బాలీవుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు రెడీ అయింది.