బాలికపై కోతుల దాడి.. పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆందోళన

బాలికపై కోతుల దాడి.. పంచాయతీ ఆఫీస్ దగ్గర  ఆందోళన

శుక్రవారం సాయంత్రం కోతుల గుంపు కృతిక అనే బాలికపై దాడి చేశాయి. ఇంటి సమీపంలో పిల్లలతో ఆడుకుంటుండగా కోతుల గుంపు చుట్టుముట్టి దాడిచేయడంతో పాటు గుంజుకొని వెళ్తుండగా ఇంటి పక్కనే ఉన్నవారు చూసి కేకలు వేయడంతో బాలికను వదిలేసి వెళ్లిపోయాయి. కోతుల దాడిలో కృతిక కాలు, చెయ్యికి తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు  సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

శనివారం గాయాలైన బాలికను తీసుకొని తల్లిదండ్రులు, కాలనీ మహిళలు గ్రామ పంచాయతీ ఆఫీస్ ముట్టడించి ఆందోళన చేశారు. కోతుల సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి రమాదేవిని డిమాండ్ చేశారు. ప్రకృతి వనం ఆనుకొని అంగన్వాడీ పాఠశాల ఉండడం వల్ల  అందులోని చెట్ల మీద ఉంటున్న కోతులు పిల్లలు, గర్భిణీల దాడి చేస్తున్నాయన్నారు. పలుమార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోతుల సమస్య పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తహసీల్దార్ కమలాద్రికి వినతిపత్రం అందజేశారు.