కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లు ఉంటే.. మీకు గజం 100 రూపాయలా..

కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లు ఉంటే.. మీకు గజం 100 రూపాయలా..
  • అక్కడ ఎకరా రూ. 100 కోట్లు
  • మీకు గజం వంద రూపాయలా?
  • బీఆర్ఎస్ ఆఫీసులకు స్థల కేటాయింపుపై హైకోర్టులో వాదనలు
  • 34 ఎకరాల్లో భవనాలు కట్టారు
  • 16 వారాలుగా కౌంటర్ వేయలే
  • పిటిషనర్ తరఫు న్యాయవాది
  • విచారణ 3 వారాలకు వాయిదా

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఆఫీసులకు కారుచౌకకు స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్ పై బుధవారం (ఆగస్టు 16న)  హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సీఎం కేసీఆర్ ఐదో ప్రతివాదిగా ఉన్నారు. కోకాపేటలో రూ. 100 కోట్లకు ఎకరం జాగా అమ్ముతున్న ప్రభుత్వం అధికార పార్టీకి మాత్రం చదరపు గజం జాగాను కేవలం రూ. 100 కే కేటాయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లో కలిసి మొత్తం 34 ఎకరాల స్థలాన్ని పార్టీ ఆఫీసుల కోసం తీసుకున్నారని తెలిపారు. ఆ స్థలాల్లో ఆఫీసులు కూడా నిర్మించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ న్యాయస్థానానికి విన్నవించారు. ఈ కేసులో 16 నెలలుగా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయడం లేదని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.