వర్షాలు, వరదలపై నివేదిక ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు..? : హైకోర్టు

వర్షాలు, వరదలపై నివేదిక ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు..? : హైకోర్టు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వం సమర్పించిన రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇవాళ అంటే శుక్రవారం రోజు (ఆగస్టు 4న) పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. సమగ్ర నివేదిక సమర్పించడానికి మరో రెండు రోజులు గడువు కోరింది ప్రభుత్వం. 

సోమవారం రోజు  (ఆగస్టు 9)  పూర్తిస్థాయిలో వరదలు, వర్షాలపై నష్టాలపై రిపోర్ట్ సమర్పిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. నివేదిక ఇవ్వడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నారని చీఫ్ జస్టిస్  ప్రశ్నించారు. సోమవారం (ఆగస్టు 9న) రోజు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వరద ప్రభావిత బాధితులకు వెంటనే పరిహారం , సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వ నివేదిక పరిశీలించిన తరువాత ఆదేశాలు ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి (ఆగస్టు 9) వాయిదా వేసింది.