
అమృత్సర్: పంజాబ్లోని అటారీ–వాఘా సరిహద్దుల్లో శుక్రవారం ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారత్, పాకిస్తాన్ సైనికులు నిర్వహించిన స్పెషల్ బీటింగ్ రిట్రీట్ చూపరులను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
దాదాపు గంట పాటు స్పెషల్ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరిగింది. సాయంత్రం ఇరు దేశాల మధ్య ఐరన్ గేట్లను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికులు విన్యాసాలు చేశారు. మన దేశం తరపున బీఎస్ఎఫ్ సైనికులు బీటింగ్ రిట్రీట్లో పాల్గొనగా.. పాక్ తరపున రేంజర్లు పాల్గొన్నారు.