
రంగారెడ్డి జిల్లా: ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా చెలరేగిన మంటలను అదుపుచేయబోయి ఓ ఉద్యానవన శాస్త్రవేత్త మరణించారు. జిల్లాలోని కందుకూరు మండలం సరస్వతిగుడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరస్వతిగుడా వద్ద ఓ వ్యవసాయ పొలంలో ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా చెలరేగిన మంటలను చెట్ల కొమ్మలతో సాయం ఉమ మహేశ్వర రావు(72) అనే ఉద్యానవన శాస్త్రవేత్త అదుపుచేయబోయారు. ఇంతలో ఆ మంటలు ఆయనకు అంటుకోవడంతో ఆయన అక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.