మనస్పర్థలతో గృహణి ఆత్మహత్య

మనస్పర్థలతో గృహణి ఆత్మహత్య

జూబ్లీహిల్స్ :  దంపతుల మధ్య మనస్పర్థలతో గృహణి ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన రమణ, చందన భార్యాభర్తలు బతుకు తెరువు కోసం  రెండేళ్ల కిందట సిటికి వచ్చారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ .2లోని  ఇంద్రనగర్ ఉంటున్నారు. రమణ రెండు నెలల కింద  సినీ నిర్మాత బండ్ల గణేశ్​ కుటుంబసభ్యుల కారు డ్రైవర్ గా చేరాడు.

భార్యాభర్తల మధ్య పలుమార్లు  వివాదం తలెత్తగా.. చిన్నపాటి సమస్యకే చందన అలిగేది. సోమవారం ఉదయం రమణ డ్యూటీకి వెళ్లగా.. చందన భర్తకు వాట్సాప్ కాల్ చేసింది. మళ్లీ ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తను ఆత్మ చేసుకుంటున్నానంటూ భర్తను బెదిరించింది. వద్దని భర్త చెప్పినా వినకుండా ఇంట్లో ఫ్యానుకు చందన ఉరేసుకుని చనిపోయింది. రమణను అదుపులో కి తీసుకొని బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.