డిజిటల్ ఇండియా కోసం ఎయిర్‌టెల్ సావరిన్ క్లౌడ్.. దేశంలోనే డేటా స్టోరేజ్

డిజిటల్ ఇండియా కోసం ఎయిర్‌టెల్ సావరిన్ క్లౌడ్.. దేశంలోనే డేటా స్టోరేజ్

మన దేశంలో డిజిటల్ పేమెంట్స్, హెల్త్ కేర్, ప్రభుత్వ సేవలు, వ్యాపార కార్యకలాపాల ద్వారా రోజురోజుకూ భారీగా సున్నితమైన డేటా ఉత్పత్తి అవుతోంది. ఈ తరుణంలో డేటా ఎక్కడ స్టోర్ అవుతోంది, దానిపై ఎవరి నియంత్రణ ఉంది అనే ప్రశ్నలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ చట్టాలకు లోబడి డేటాను సురక్షితంగా ఉంచేందుకు "సావరిన్ క్లౌడ్" ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ప్రతి డిజిటల్ పని ద్వారా జనరేట్ అయ్యే సమాచారం భద్రపరచడం అత్యవసరంగా మారింది. డేటా చౌర్యం, సైబర్ మోసాలను అరికట్టడానికి బలమైన భద్రతా చర్యలు అవసరం. విదేశీ చట్టాల పరిధిలోకి వెళ్లకుండా, దేశ సరిహద్దుల లోపలే డేటాను ఉంచేలా డిజైన్ చేయబడినదే సావరిన్ క్లౌడ్. ఇది కేవలం భౌతిక నిల్వ మాత్రమే కాకుండా, ఎన్‌క్రిప్షన్ కీలు, యాక్సెస్ అనుమతులు, క్లౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ పై పూర్తి నియంత్రణను అందిస్తుంది.

భారత డిజిటల్ మౌలిక సదుపాయాల్లో చారిత్రాత్మక మైలురాయిగా.. ఎయిర్‌టెల్ తన ఎక్స్‌టెలిఫై ద్వారా ఆగస్టు 2025లో ఎయిర్‌టెల్ క్లౌడ్ సేవలను ఆవిష్కరించింది. దేశంలోనే మొట్టమొదటి టెల్కో-గ్రేడ్ సావరిన్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌గా ఇది నిలిచింది. మొదట ఎయిర్‌టెల్ సొంత డిజిటల్ అవసరాల కోసం రూపొందించబడిన ఈ వేదిక.. నిమిషానికి ఏకంగా 1.4 బిలియన్ల లావాదేవీలను నిర్వహించగల అత్యుత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఎయిర్‌టెల్ క్లౌడ్ పూర్తిగా "సావరిన్-బై-డిజైన్" ఆర్కిటెక్చర్‌తో రూపుదిద్దుకుంది. దీని ద్వారా డేటా, మౌలిక సదుపాయాలు, కంట్రోల్-ప్లేన్ ఆపరేషన్స్ అన్నీ పూర్తిగా భారత్‌లోనే నియంత్రించబడతాయి. ఎయిర్‌టెల్ దేశవ్యాప్త నెట్‌వర్క్, నెక్స్ట్-జెన్ డేటా సెంటర్లపై నిర్మించబడిన సర్వీస్ కీలక సేవలను అందిస్తోంది.

ALSO READ : ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్ ఫోర్స్ అధికారుల సర్వే

* 99.99% అప్‌టైమ్.. అంతరాయం లేని నిరంతర సేవలు.
* అత్యుత్తమ డిజాస్టర్ రికవరీ, భద్రత.
* పూర్తి స్థాయి సేవలు: ఐఏఏఎస్, పీఏఏఎస్, జెన్-ఏఐ ఆధారిత సేవలు.
* ప్రభుత్వ గుర్తింపు.. కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ సర్టిఫికేషన్లతో కూడిన నమ్మదగిన దేశీయ సంస్థ.